బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ 61 పతకాలతో ప్రపంచ దేశాల్లో నాలుగో ర్యాంకులో నిలిచింది

బ్యాడ్మింటన్, రెజ్లింగ్ ఈ రెండు క్రీడల నుంచే అత్యధిక పతకాలు వచ్చాయి

బ్యాడ్మింటన్‌లో సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, లక్ష్యసేన్‌లు స్వర్ణ పతకాలను సాధించారు

ప్రస్తుతం 20 యేళ్ల లక్ష్యసేన్‌ పేరు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది

లక్ష్యసేన్‌ తన మొట్టమొదటి ప్రదర్శనలో స్వర్ణంతో తిరిగి వచ్చాడు

పురుషుల సింగిల్స్ సత్తాచాటిన లక్ష్య.. ప్రకాష్ పదుకొణె, సయ్యద్ మోడీ, పారుపల్లి కశ్యప్ తర్వాత CWGలో స్వర్ణం సాధించిన నాలుగవ ఇండియన్‌గా నిలిచాడు

ఓపెనింగ్‌ గేమ్‌లో ఓడినా తుదకు గెలిచి ఆందరినీ ఆశ్చర్యపరిచాడు లక్ష్యసేన్‌