కలర్స్‌ ప్రోగ్రామ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది స్వాతి.

అందుకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకెంతో గుర్తింపునిచ్చిన ఆ ప్రోగ్రామ్ పేరునే తన ట్యాగ్‌గా మార్చుకుంది.

డేంజర్‌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే సినిమా కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

ఆతర్వాత మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమివ్వలేదు.

తాజాగా ఎట్టకేలకు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది స్వాతి.