కొబ్బరి నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు

దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డకు వెంట్రుకలు బాగుంటాయని, గర్భిణికి కూడా జుట్టు రాలిపోయే పరిస్థితి ఎదురవదని నిపుణులు చెబుతున్నారు

గర్భధారణ తర్వాత ప్రతిరోజు పొట్టపై కొబ్బరి నూనెతో​​మసాజ్ చేయడం వల్ల  స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను వదిలించుకోవచ్చు

గర్భధారణ సమయంలో రుచి కోల్పోతే కొబ్బరి నూనె పుక్కిలించడం మంచిది

ఇలా చేయడం వల్ల స్త్రీల మూడ్ బాగవుతుంది. ఇతర ఆహారాలను తినడానికి ఇష్టపడుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు

గర్భధారణకు ముందు అలెర్జీని కలిగి ఉంటే గర్భధారణ సమయంలో మీకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి

శరీర దురదను తొలగించడానికి డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం

స్నానం చేసిన తర్వాత శరీరానికి కొబ్బరినూనెను రాసుకుంటే దురద నుంచి ఉపశమనం లభిస్తుంది