కొబ్బరి నూనె వంట కోసం అమూల్యమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ, దీనిని వంటతో పాటు ఇతర విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.

కొబ్బరి నూనెను మీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే దాని రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

గతంలో సౌత్ ఇండియన్ వంటకాల్లో మాత్రమే ఉండే కొబ్బరినూనె ఇప్పుడు కేకులు, పేస్ట్రీలు, కుకీలకు హెల్తీ ఫ్యాట్‌గా తయారవుతోంది. 

యాంటీబయాటిక్‌తో పాటు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల కాలిన గాయాలను త్వరగా నయం చేయవచ్చు.

జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.జుట్టును బలోపేతం చేయడానికి మూలాలకు ప్రోటీన్లు, పోషకాలను అందిస్తుంది.

 సహజమైన మేకప్ రిమూవర్ కోసం చూస్తున్నట్లయితే, కొబ్బరి నూనె సరైన ప్రత్యామ్నాయం. 

కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవడం మంచిది.