లవంగాలతో ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం..
నేటి కాలంలో అధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మధుమేహం ఒకటి
డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం
రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు దాపురిస్తాయి
ప్రతి వంట గదుల్లో కనిపించే లవంగం మొగ్గలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లవంగాలలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి
లవంగాలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగల లక్షణాలు కూడా లవంగాలకు ఉంటుంది
గ్లాసు నీళ్లలో 8 లేదా 10 లవంగాలను ఉడకబెట్టి, వడగట్టి గోరువెచ్చగా తాగాలి
ఇలా మూడు నెలల పాటు తాగితే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది