దంతాలకు బ్రేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత శుభ్రం చేసుకొవడం చాలా ముఖ్యం
ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
మీ బ్రేస్‌లు దంతాల్లో స్థిరంగా ఉంటే అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవాలి
దంతాల నుంచి మీ బ్రేస్‌లు తొలగించగలిగితే వాటిని క్రమం తప్పకుండా కడగాలి
కడిగే సమయంలో ఒక టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి శుభ్రం చేయాలి
బ్రేస్‌లు ఉన్నవారు రోజు మొత్తం ఏదో ఒకటి తింటారు. అటువంటి పరిస్థితిలో మళ్లీ మళ్లీ బ్రేస్‌లను శుభ్రం చేయడం సాధ్యం కాదు
దీని కోసం మీరు మౌత్ వాష్ ఉపయోగిస్తే మంచిది. మీరు మౌత్ వాష్ ద్రవాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు ఉపయోగించవచ్చు
మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా మౌత్ వాష్ ఉపయోగించవచ్చు