శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా.

అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారింది.

ఓ వైపు గ్లామర్‌ పాత్రలో రాణిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తోందీ బ్యూటీ.

కొద్ది రోజులుగా యంగ్ హీరో సందీప్ కిషన్ , హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తుంది.

రెజీనా బర్త్ డే సందర్భంగా.. సందీప్ కిషన్ హ్యాపీ బర్త్ డే పాప.. ఐ లవ్ యూ..ఎప్పుడూ నీకు మంచే జరగాలి అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఇది చూసి వారిద్దరి రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ తమిళనాట ప్రచారం జోరందుకుంది.

 మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. సందీప్ రెజీనా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. వాళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్ ప్రైజ్ అవుతారు. 

అందుకని చెన్నై మీడియా మా గురించి తెలియక అలా రాసేవారు” అని క్లారిటీ ఇచ్చారు. అంటూ క్లారిటీ ఇచ్చేసారు.