సినిమాల్లో ట్విస్టులు.. మా అంటే రెండో మూడో ఉంటాయి. కానీ.. సీరియల్లో ట్వీస్టులే.. బోలెడన్నీ ఉంటాయి.

ఇప్పుడు పవిత్ర, నరేష్ యవ్వారలంలో కూడా ఇలానే జరుగుతున్నాయి. ఇదేందిది! అని అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాయి.

అప్పుడెప్పుడో ప్రేమించుకుంది మొదలు.. మధ్యలో కలిసి ఉంటున్నామని చెప్పింది మొదలు.. తనపై దాడి చేశారని నరేష్ అరిచి గీ పెట్టి చెప్పింది మొదలు…

అప్పుడెప్పుడో ప్రేమించుకుంది మొదలు.. మధ్యలో కలిసి ఉంటున్నామని చెప్పింది మొదలు.. తనపై దాడి చేశారని నరేష్ అరిచి గీ పెట్టి చెప్పింది మొదలు…

ఇప్పటి వరకు అంతా సీరియల్లోలా చాలా ల్యాగ్‌గానే సాగిన నరేష్ పవిత్ర లవ్‌ స్టోరీ.. ఒక్కసారిగా ఊపందుకుంది.

అయితే ‘ఇంటింటి రామాయణం’ సినిమా ప్రెస్‌మీట్‌లో తాజాగా మాట్లాడిన నరేష్ తన పెళ్లి వీడియోపై రియాక్టయ్యారు. 

"ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది.రియల్‌ లైఫ్‌ వేరు, రీల్‌ లైఫ్‌ వేరుత్వరలోనే ప్రెస్‌ మీట్‌ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. 

అప్పటివరకు ఓపికతో ఉండండి. ప్రస్తుతం నాకు ప్రైవసీ కావాలంటూ" నరేష్‌ చెప్పుకొచ్చారు. తన పెళ్లి నిజమో.. లేక అబద్దమో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా మాట దాటేశారు.

అయితే నెటిజన్లు మాత్రం ఇంటింటి రామాయణం సినిమాలోనే ఆ పెళ్లి సీన్ అంటూ కోట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు.