డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

అలాంటి ఆరోగ్య పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఒకటి.

జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, రాగి, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం,విటమిన్ బి6, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.

అందుకే జీడిపప్పును పోషకాల నిధి అని పిలుస్తారు.దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు సూచిస్తారు.

పైగా ఇవి ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి. అందుకే ఎంతోమంది వీటిని ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

అదే సమయంలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరిగే అవకాశముందని కొందరు భయపడుతుంటారు.

అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదంటున్నారు నిపుణులు.