ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో బ్లాక్ బూస్టర్ అందుకున్నారు చిరంజీవి.
ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.
దీని తర్వాత చిరు యూవీ క్రియేషన్స్ సంస్థలో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని ‘బింబిసార’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.
ఇప్పుడాయన చిరు కోసం ఓ సరికొత్త సోషియో ఫాంటసీ కథ రాసుకున్నారని తెలిసింది.
ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ బాగా నచ్చడంతో చిరు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యమున్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులకు తగిన సమయం తీసుకొని ఆగస్టు నుంచి చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారట.