మెగా ఫ్యామిలీలో అమ్మాయిలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది.

ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.

 ఆమె నటిగా కాకుండా మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

 మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు.

 ఈ వర్క్ చేస్తూనే నిర్మాతగా కూడా కొనసాగేందుకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.

మొదట కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించిన సుస్మిత, ప్రస్తుతం యువ హీరోలతో చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.

ఆమె ఇటీవల యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక చిత్రాన్ని నిర్మించారు.

ప్రశాంత్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరపైకి తీసుకురానున్న శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.