టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే.
సేవా కార్యక్రమాలు చేసే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు.
తాజాగా చిరంజీవి క్యాన్సర్ ఓపెనింగ్ సెంటర్ కు హాజరు కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిరంజీవి తనకు క్యాన్సర్ సోకిందని చెప్పకపోయినా అలా చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ కావడం గమనార్హం.
ఇండస్ట్రీకి చెందిన తక్కువ ఆదాయం ఉన్న సినీ కార్మికులకు, ఫ్యాన్స్ కు, మీడియా వాళ్లకు క్యాన్సర్ ను ముందుగా గుర్తించే పరీక్షలను నిర్వహించాలి అని చిరు అన్నారు
అందుకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ను ఆస్పత్రులకు అనుసంధానం చేసి క్యాన్సర్ పై పోరాటం చేస్తానని మెగాస్టార్ తెలిపారు.
చిరంజీవి చేసిన కామెంట్లు క్యాన్సర్ సెంటర్ నిర్వాహకులను సైతం సంతోషపెట్టాయి.
అయితే చిరంజీవి చెప్పిన ఈ కామెంట్ల కంటే చెప్పని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.