వాల్తేరు వీరయ్యతో అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ అందించాడు మెగాస్టార్‌ చిరంజీవి.

ఈ సినిమాకు సుష్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది.

సుష్మిత అందించిన కాస్ట్యూమ్స్‌లో అటు మాస్‌ లుక్‌లో, ఇటు పాటల్లో క్లాస్‌ లుక్‌లో అదరగొట్టేశాడు బాస్‌.

ఇదిలా ఉంటే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూతురికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు చిరంజీవి.

బంగారు, వెండి పూత కలగలిపి ఉన్న దుర్గాదేవి ప్రతిమను సుష్మితకు కానుకగా అందించాడు.

ఈ సందర్భంగా తండ్రితో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సుష్మిత. 'నాకు ఈ బహుమతిచ్చినందుకు థాంక్యూ నాన్న.

 మహిళను దుర్గాదేవి కంటే శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు?' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.