తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార ఇటీవల ‘కనెక్ట్’ ప్రీమియర్ షోలో పాల్గొన్నారు.
వివాహం, తల్లిదండ్రులైన తర్వాత వీరిద్దరూ తొలిసారి పబ్లిక్ ప్రోగ్రామ్‌లో సందడి చేశారు.
దీంతో ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నయన్ అభిమానులతో ముచ్చటిస్తోన్న వీడియోను ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ షేర్ చేయగా పలువురు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు చేశారు.
నయనతార లుక్స్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన పలువురు నెటిజన్లపై గాయని చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళ శరీరాకృతి గురించి చెత్త కామెంట్లు చేసే ఇలాంటి వ్యక్తులకు ఆడపిల్లలు ఉంటే ఏంటి పరిస్థతి? అంటూ ఆమె ప్రశ్నించారు.