ఊబకాయానికి ఈ విత్తనాలతో చెక్..

చియా విత్తనాలను రోజూ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

స్థూలకాయాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకోండి.

చియా విత్తనాల నుంచి శరీరం విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పొందుతుంది.

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.

చియా గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం నిమ్మరసంతో తాగాలి.

చియా గింజలు కలిపిన నారింజ రసం కూడా తాగవచ్చు.

చియా విత్తనాలు, క్వినోవా కలపి ఉడికించాలి. ఇందులో నచ్చిన కూరగాయలను కలుపుకొని తినొచ్చు.

చియా విత్తనాలను సలాడ్‌ రూపంలోనూ తీసుకోవచ్చు.

సలాడ్‌లో ప్రతిరోజూ 1-2 టీస్పూన్ల చియా గింజలను కలిపి తీసుకోవచ్చు.

చియా విత్తనాలను గంజితో కలిపి కూడా తినవచ్చు. ఉదయం అల్పాహారానికి ఇది ఆరోగ్యకరమైన ఎంపిక.