మీ జుట్టును సిల్కీగా, షైనీగా మారాలంటే ఎండలో తిరగడం తగ్గించాలి
ఎండలోకి వెళ్ళేటప్పుడు జుట్టుకు టోపి ధరించి వెళ్లడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి
అందమైన జుట్టు కోసం తప్పకుండా విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉండే నూనెలను ఉపయోగించాలి
ఈ నూనెలను క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది
తరచుగా హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకోవడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి
కాబట్టి ఆరోగ్యమైన జుట్టు కోసం తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జుట్టు సిల్కీగా, మృదువుగా, నల్లగా ఉండడానికి కలబంద, పెరుగు మాస్క్‌ను ఉపయోగించాలి
ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చి జుట్టును దృఢంగా, నల్లగా చేసేందుకు దోహదపడుతుంది