సూర్యకాంతి శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గిస్తుందని అందరికి తెలిసిన విషయమే.
అయితే ఈ సూర్యకాంతితో చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ సూర్యరశ్మితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలా మంది అనుకుంటారు.
కానీ సూర్యరశ్మి శక్తి వల్ల చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని నిపుణుల మాట.
సూర్యుని UV కిరణాలు శరీరంపై పడడం వల్ల సోరియాసిస్, దురద, కామెర్లు, మొటిమలు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
స్కిన్ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే అనేక బాక్టీరియాలను కూడా సూర్యరశ్మి నివారిస్తుంది.
కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ సూర్యరశ్మి కిరణాల ద్వారా విటమిన్ డి పొందాల్సి ఉంటుంది.