మందార పువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.

మందార పువ్వు చర్మం, జుట్టు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుంది.

ఈ పువ్వు అందానికి, అలంకారానికే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మందార పువ్వులను తినడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయంటున్నారు.

మరి మందారను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మందార టీ తయారు చేసి త్రాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

మందార పువ్వులో ఫ్లేవనాయిడ్లు రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మందార పువ్వు ప్రభావవంతంగా ఉంటుంది.

మందార పువ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మందార పువ్వు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.