ప్రస్తుత జీవనశైలి ప్రతి ఒక్కరినీ వేధించే ఆరోగ్య సమస్యల్లో ఎసిడిటీ ఒకటి

జీర్ణశక్తి సన్నగిల్లడమే ఇందుకు ప్రధాన కారణం

ఏ కొంచెం ఆహారం తీసుకున్నా గ్యాస్, గుండెల్లో మంట వేదిస్తుంటుంది

ఒకే చోట కూర్చోవడం, పని చేయడం, తినడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సమస్య జటిలమవుతోంది

దీనికి విరుగుడుగా ప్రతిరోజూ యాంటాసిడ్ తీసుకోవడం సరికాదు

వాముతో ఎసిడిటీతోపాటు జీర్ణసంబంధిత సమస్యలన్నింటినీ తరిమేయవచ్చు

గ్యాస్ వల్ల గుండెల్లో మంటతో బాధపడేవారు రోజుకు 2 చెంచాల వామును నీటిలో వేసి మరిగించి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఉపశమనం పొందవచ్చు

పీరియడ్‌ సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్నం అన్నం తిన్నాక ఉప్పు, నిమ్మకాయ రసంతో వాము కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది