ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జనాలు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది
సరైన తిండి లేక, సమయానికి నిద్ర లేకపోవడంతో.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి
చాలా మంది కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో సతమతం అవుతున్నారు
కొన్ని యోగాసనాలు గ్యాస్ట్రిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెడతాయంటున్నారు యోగా నిపుణులు
పశ్చిమోత్తనాసనం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది
హలాసనం మలబద్ధకం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది
బాలసనం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాకుండా వెన్నునొప్పి, ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది
ఆనంద బాలసనం జీర్ణ వ్యవస్థ, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు దోహదపడుతుంది. వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది