అందరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌లను వాడుతుంటారు. అయితే సిలిండర్లపై కొన్నింటిని మనం పెద్దగా గమనించము

ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్సపయిరీ తేదీ కూడా ఉంటుంది. దానిన గమనించడం ఎంతో ముఖ్యం

ఎక్స్ పయిరీ గడువు ఎలా తెలుసుకోవడం.. సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి

ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ పై A 25 అని ఉందనుకోండి. కచ్చితంగా అదే ఎక్స్ పయిరీ తేదీ

A 25 అంటే జనవరి నుంచి మార్చి, 2025 వరకు అని అర్థం. సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్థం

మార్చి తర్వాత తిరిగి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే పంపిణీకి రావాల్సి ఉంటుంది

B అంటే ఏప్రిల్ – జూన్ అని, C – అంటే జూలై – సెప్టెంబర్ వరకు అని, D -అంటే అక్టోబర్ – డిసెంబర్ వరకు అని అర్థం

ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత.. పైన సీల్ ను చెక్ చేసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి