ప్రతి ఇంట్లోనూ సులువుగా లభించే బేకింగ్ సోడా తల నుంచి పాదాల వరకు అందాన్ని కాపాడుతుంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం సహజమే.

బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. ఇది పొడిగా ఉంటుంది.

బేకింగ్ సోడా అనేది ఆల్కలీన్ పదార్ధం. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఉంటాయి.

ఇది ఒక బ్యూటీ ప్రాడక్టుగా కూడా పనిచేస్తుంది.

దీన్ని చర్మంపై ఉపయోగించే ముందు, చేతిపై కొద్దిగా అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.

మొటిమలను వదిలించుకోవడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం.

మొటిమలను తొలగించడంతో పాటు, చర్మం pH స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేయండి.

ఈ పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతంపై ఒకటి నుండి రెండు నిమిషాలు మసాజ్ చేయండి.

రోజుకు 2 నుండి 3 సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.