ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఛార్మి ఆ తర్వాత నిర్మాతగా మారిపోయిన విషయం తెలిసిందే.

దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది.

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి సినిమాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల వీరి కాంబోలో లైగర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.మూవీ రిలీజ్‌ రోజు నుంచి సైలెంట్ అయిపోయ్యరు ఛార్మీ..

ఇదిలా ఉంటే తనకు పూరిజగన్నాథ్ కు మధ్య గొడవలు జరిగాయని. ఇద్దరి మధ్య మాటలు లేవని ఏవేవో రూమర్స్ పుట్టుకొచ్చాయి.

ఈ రూమర్స్ పై స్పందిస్తూ రూమర్స్ రూమర్స్ రూమర్స్ అంటూ తాజాగా ట్వీట్ చేసారు ఛార్మి.

త్వరలోనే పూరీ కనెక్ట్స్ మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ చేసామని ట్వీట్ లో రాసుకొచ్చారు.