75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అతి తక్కువ మార్పులకు గురైంది బడ్జెట్‌ అని చెప్పుకోవచ్చు

స్వతంత్ర భారత దేశపు తొలి బడ్జెట్‌ను తొలి ఆర్థిక మంత్రి RK షణ్ముగం శెట్టి నవంబర్‌ 26, 1947న ప్రవేశపెట్టారు

సంవత్సరం చివరి రెండో నెలలో వచ్చిన బడ్జెట్‌ కాలక్రమంలో సంవత్సరం తొలి రెండో నెలకు వచ్చింది

బ్రిటీష్‌ వలసవాద విధానాన్ని కొనసాగిస్తూ 1999 వరకు ఇండియాలో బడ్జెట్‌ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు

బ్రిటీష్‌ వారి టైమ్‌ జోన్‌ మన కంటే నాలుగున్నర గంటల వెనుక ఉంటుంది కాబట్టి బ్రిటీష్‌ వారి హయాంలో సాయంత్రం 5 గంటల సమయాన్ని నిర్ణయించారు

దీన్ని 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఉదయం 11 గంటలకు మార్చారు. దీనికి కారణం లేకపోలేదు

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత అందులో చేసే ప్రకటనలు, గణాంకాలు, కేటాయింపులపై మెరుగైన చర్చకు అవకాశం ఉంటుందనే ఉద్దేశం బడ్జెట్‌ ప్రవేశపెట్టే వేళను మార్చారు

2017లో ఈ సంప్రదాయానికి తెరదించారు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చారు

2021-22 నుంచి బడ్జెట్‌ మొత్తం పేపర్‌లెస్‌ డాక్యుమెంట్‌గా మార్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌ యాక్సెస్‌ చేసుకునేందుకు యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ ప్రస్తుతం అందుబాటులో ఉంది