పలు ఆరోగ్య సమస్యల కారణంగా మన చర్మం రంగు మారుతుంది. ఏ రంగు ఏ ఆరోగ్య సమస్యకు లక్షణమో ఇప్పుడు తెలుసుకుందాం

చర్మం పసుపు రంగులోకి మారితే.. కాలేయంలో ఏదో ఒక సమస్య ఉన్నట్లు అర్ధం.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

చర్మం నీలం రంగులోకి మారితే.. శ్వాసనాళంలో సమస్య ఉన్నట్లు..

అరచేతులు, అరికాళ్లు ఎరుపు రంగులోకి మారితే.. హ్యాండ్ ఫుట్ సిండ్రోమ్ సంభవించే లక్షణం.. ఈ సందర్భంగా వాపు సమస్య కూడా కనిపిస్తుంది.

చర్మం ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే.. చర్మ సమస్య లేదా సన్ అలెర్జీ ఉందని అర్ధం చేసుకోవాలి

చర్మంపై అకస్మాత్తుగా గాయమైనా, దద్దుర్లు, పుండ్లు లాగా ఏర్పడినా.. రక్త రుగ్మత ఉందని అర్ధం చేసుకోవాలి

చర్మ కాన్సర్ లాంటి సమస్యలున్నా.. చర్మం రంగు మారుతుంది. ఇంకా చలనం కూడా మందగిస్తుంది.

శరీరంలో ఎక్కడో ఒకచోట కణితి ఉంటే.. దాని చుట్టూ ఉన్న చర్మం రంగు మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించడం మంచిది