సింహం తన సహజ స్వభావమైన హింసను ఎప్పటికీ విడిచిపెట్టనట్లే.. దుర్మార్గుడు కూడా తన దుష్టత్వాన్ని ఎప్పటికీ వదులుకోలేడు
అందుకనే చెడు వ్యక్తి చెప్పే తియ్యని మాటలకు లొంగి ఎప్పుడూ తప్పు చేయవద్దు
అబద్ధం చెప్పే వ్యక్తి ఏదో ఒకరోజు కష్టాల్లో కూరుకుపోతాడు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని దాచడానికి అతను మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది
అలాంటప్పుడు ఏదొక రోజు ఆ అబద్ధం బయటపడి సిగ్గుపడే సందర్భం వస్తుంది
ఎవరైతే చెప్పేమాటలు చేసే పనులు ఒక దానికొకటి సంబంధం లేకుండా విరుద్ధంగా ఉంటాయో అలాంటి వ్యక్తులు ఎప్పుడూ నమ్మదగినవారు కాదు
చదువు లేని చోట, ఉపాధి మార్గం లేని ప్రదేశాలకు బుద్ధిమంతుడు ఎప్పుడూ వెళ్ళడు
నడుస్తున్న సమయంలో పాదాల కింద ఉన్న ప్రదేశాలు చూడాల్సి ఉంటుంది
అలా చూడకుండా నడిచే వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు తమకి తాముగా ఇబ్బందులను ఆహ్వానిస్తారు