ఈ జన్మలో మనం ఏం చేస్తున్నా, ఏం పొందుతున్నా.. ఈ ప్రస్తుత కర్మగా భావిస్తారు. ప్రస్తుత జీవితం గత జన్మలలో చేసిన చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.

ఈ జీవితం మంచి, చెడు కలయిక.. చాణక్య సూత్రం ప్రకారం ఒక వ్యక్తి తన పూర్వ జన్మ, కర్మ ఆధారంగా ఈ జన్మలో కర్మ ఫలాలను అనుభవిస్తాడు.

జీవితంలో మంచి జీవనశైలి, మంచి ఆహారం కలిగి ఉండటం ఉత్తమ జీవనానికి సంకేతం.

మంచి చెడులతోనే జీవితం కాదు.. మనం తిన్న ఆహారం జీర్ణించుకునే సత్తా కూడా ఉండాలి. జీర్ణశక్తి ఉన్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు.

ధనవంతుడు అంటే సంపన్నుడు అని కాదు. డబ్బును సక్రమంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నవాడు.

మంచి జీవిత భాగస్వామి దొరకడం కూడా అదృష్టమే. చాణక్య సూత్రాల ప్రకారం, సద్గుణ, తెలివైన జీవిత భాగస్వామి అయితే.. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.

దానం చేయడం చాలా శ్రేయస్కరం, పుణ్యం. ఒక వ్యక్తికి చాలా డబ్బు ఉన్నప్పటికీ సహాయం చేయడం లేదా ఇచ్చే స్వభావం లేకుంటే, అతని పతనం త్వరగా జరుగుతుందని చాణక్యనీతి పేర్కొన్నాడు.