కాలీప్లవర్‌ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో చేసుకునే ఏ పదార్థం అయినా రుచిగా ఉంటుంది.

కాలీఫ్లవర్‌తో సూప్, కూర, ఊరగాయ, కుడుములు వంటి రకరకాల వంటకాలను చేసుకోవచ్చు.

కాలీఫ్లవర్‌లో ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి. విటమిన్‌-సి, ఫైబర్, ఫోలేట్, విటమిన్‌-బి, పొటాషియం, ప్రొటీన్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి గుణాలు ఉన్నాయి.

కాలీఫ్లవర్‌లో కేలరీలు తక్కువుగా ఉండటంతో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది.

కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో పోటాషియం ఉంటుంది. ధమనులలో రక్తాన్ని అడ్డుకోవడాన్ని ఇది నివారిస్తుంది.

గర్భిణులకు కాలీఫ్లవర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గర్భిణుల ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్లో విటమిన్ కె, విటమిన్ సి ఉన్నాయి. ఇవి ఎముకులను బలంగా ఉంచడంలో సమాయపడతాయి.

కాలీఫ్లవర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.