చాలామంది జీడిపప్పును ఎంతో ఇష్టంగా తింటారు అనే విషయం తెలిసిందే.
ఈ జీడిపప్పు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు, ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
జీడిపప్పు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.
జ్ఞాపకశక్తి పెరిగి మెదడు యాక్టివ్ గా, చురుకుగా మారాలని అనుకునేవారు జీడిపప్పును ఉదయం పరగడుపున తినాల్సి ఉంటుంది.
తరువాత వెంటనే ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇలా ఒక నెలలో 15 రోజులపాటు చేసి.. మరో 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్లీ 15 రోజులు చేయాలి.
ఇలా చేయడం వల్ల మెదడు కణాలకు శక్తి లభిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
జీడిపప్పులో లుటీస్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి.
జీడిపప్పును రక్త పోటు ఉన్న వాళ్లు కూడా తినవచ్చు. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువగాను, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి.