అరటి పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. ఇవి త్వరగా జీర్ణం కావడమే కాకుండా ఆరోగ్యాన్ని, త్వరగా శక్తిని ఇస్తాయి.

 తిన్న తరువాత ఎక్కువసేపు పొట్టను నిండుగా ఉంచుతాయి. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెరను అందిస్తాయి.

అరటిపండ్లు మనకు ఈజీగా అన్నికాలాలలోనూ దొరికే సరైన సూపర్ ఫుడ్.

అరటిపండు చర్మంపై నల్లటి మచ్చలు వచ్చాయంటే కుళ్ళిన పండ్లని కాదు, అరటిపండ్లపై నలుపు-గోధుమ రంగు మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.

అరటి తొక్కపై నల్ల మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే, అది పండినది. ఇది తినడానికి ఇష్టపడరు కానీ, శరీరానికి పోషకాలను అందిస్తుంది.

పండిన అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పెరిగేకొద్దీ, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతుంది. అరటిపండ్లు పక్వానికి వచ్చే కొద్దీ మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.

మీకు కొద్దిగా గుండెల్లో మంటగా అనిపిస్తే, ఒక అరటిపండును తింటే కొన్ని నిమిషాల్లో మీ రిలీఫ్ వస్తుంది.