ప్రజంట్ మొబైల్ ఫోన్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు

చాలామంది ఉదయం లేవగానే మొదట పట్టుకునేది మొబైల్ ఫోనే

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందువరకు కూడా చాలామంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు

కొందరు డే అంతా వినియోగించుకునేందుకు వీలుగా రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటారు

అయితే ఈ ప్రాక్టీస్ మంచిదా కాదా..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది

ఫోన్​ను రాత్రంతా ఛార్జింగ్​లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదని  నిపుణులు చెబుతున్నారు

ప్రజంట్ ఎక్కువ వాడకంలో ఉన్నవి లిథియం-అయాన్​ బ్యాటరీలు

ఇవి ఫోన్​ ఫుల్​ ఛార్జ్​ అవ్వగానే కరెంట్ తీసుకోకుండా రిస్ట్రెక్ట్ చేసే పరికరాలను ఇన్​బిల్ట్​గా కలిగి ఉంటున్నాయి

100 పర్సెంట్ ఛార్జింగ్ మాత్రమే అవుతుందని… ఆ తర్వాత ఫోన్ ఛార్జ్‌ను తీసుకోదని వెల్లడించారు

అయితే మీరు వినియోగించే బ్యాటరీ, ఫోన్ మోడల్స్ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవా? అన్నది చెక్ చేసుకోవాల్సిన అంశం