చికెన్‌ బ్రెస్ట్‌ ముక్కలు అరకేజీ, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు మూడు, ఆయిల్‌ మూడు స్పూన్లు

క్యాబేజీ తరుగు ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్‌ ఒక కప్పు, కొబ్బరి సాస్‌ పావు కప్పు, తరిగిన అల్లం అర స్పూను

ఉప్పు తగినంత, మిరియాల పొడి రెండు స్పూన్లు, స్రింగ్‌ ఆనియన్‌ తరుగు రెండు స్పూన్లు

ముందుగా స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి

తర్వాత చికెన్‌ ముక్కలు వేసి గోల్డ్‌ కలర్‌లోకి వచ్చేంతవరకు వేయించాలి

చికెన్‌ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్‌ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టాలి

నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్‌ రెడీ అయినట్లే!