అప్పుడు టీమిండియా.. ఇప్పుడు న్యూజిలాండ్.. బెడిసికొట్టిన బజ్‌బాల్‌ క్రికెట్‌..

1994లో సిడ్నీలో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడుతున్నప్పుడు కంగారూ జట్టు ఫాలో-ఆన్ ఇచ్చింది.

ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

అంతకుముందు కూడా ఇంగ్లండ్‌పై ఫాలోఆన్‌ ఇచ్చి ఆస్ట్రేలియా ఓడిపోయింది.

1981లో లీడ్స్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా టీం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది.

దీంతో కంగారూ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

అదే సమయంలో 2001లో టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆస్ట్రేలియా ఇలాంటి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వడంతో భారత్ 171 పరుగుల తేడాతో కంగారూ జట్టును ఓడించింది.

ఫాలో ఆన్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ ఇప్పుడు రెండో జట్టుగా నిలిచింది.

258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 256 పరుగులకే పరిమితమైంది.

దీంతో ఇంగ్లీష్ జట్టు న్యూజిలాండ్‌పై ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.