02 September 2023

ఇవి తెలుసుకోకపోతే మీ జేబుకు చిల్లే

ఎంచుకునే హక్కు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలి..? ఏ కంపెనీకి చెందిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలి..? అనేది కస్టమర్‌ల హక్కు.  

తాము ఎ వస్తువు.. ఏ బ్రాండ్ కొనాలో కోరుకునే స్వేచ్చ  హక్కు వినియోగదారునికి ఉంటుంది. 

ఒకవేళ వ్యాపారులు మీరు అడిగినది కాకుండా వేరే బ్రాండ్ తీసుకోవాలని బలవంతం చేస్తే మీరు ఫిర్యాదు చేయవచ్చు 

సమాచార హక్కు.. మనం కొనాలనుకునే వస్తువు గురించి పూర్తీ సమాచారం తెలుసుకునే హక్కు మానకు ఉంటుంది 

ప్రోడక్ట్ క్వాలిటీ దగ్గర నుంచి ధర వరకూ ప్రతీ విషయాన్నీ వినియోగదారుడు అడిగి తెలుసుకోవచ్చు. అన్నీ నచ్చితేనే ఆ వస్తువు తీసుకోవచ్చు

అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు.. ఏదైనా వస్తువు కొన్నప్పుడు అది బావుందా లేదా అనే విషయాన్ని చెప్పే హక్కు ప్రతి వినియోగదారునికి ఉంటుంది 

కస్టమర్ ఎప్పుడైనా మోసపోయినట్లు అనిపిస్తే వారు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు 

కంప్లైంట్స్ పరిష్కారం.. తమ హక్కులకు భంగం కలిగినా.. తాము తీసుకున్న ప్రోడక్ట్ విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తినా వాటిని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు

ఒకవేళ సదరు సంస్థ స్పందించకపోతే వినియోగదారుల ఫోరం లేదా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కేంద్రంతో సంప్రదించవచ్చు 

వినియోగదారుల హక్కుల కోసం దేశంలో హెల్ప్‌లైన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 

కస్టమర్లు తన ఫిర్యాదును నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1800114000 టోల్ ఫ్రీ నంబర్‌లో నమోదు చేయవచ్చు.