యామీ తొలి ఈవీ ఎస్‌యూ7.. సింగిల్‌ చార్జ్‌తో 800 కిలోమీటర్ల మైలేజీ

10 July 2024

TV9 Telugu

 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన షియామీ.. తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిసిటీ  వాహనం (ఈవీ) ఆకట్టుకుంటుంది. దీని పేరు స్పీడ్‌ అల్ట్రా (ఎస్‌యూ)7.

 షియామీ

దేశీయ విపణిలోకి ఇంకా రాని ఈ కారు ప్రారంభ ధర 30 వేల డాలర్లలోపే (రూ.25 లక్షలు) ఉంటుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.

రూ.25 లక్షలు

ఇది చైనాలో టెస్లా మాడల్‌ 3 ప్రారంభ ధర కన్నా 4 వేల డాలర్లు తక్కువే కావడం గమనార్హం. చైనాలో ఈ ఏడాది మార్చి నుంచి ఎస్‌యూ7 అమ్మకాలు మొదలైంది. కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన వస్తోంది.

షియామీ

ఈ-మోటర్‌, సీటీబీ ఇంటిగ్రేటెడ్‌ బ్యాటరీ, షియామీ డై-క్యాస్టింగ్‌, షియామీ పైలట్‌ అటానమస్‌ డ్రైవింగ్‌, స్మార్ట్‌ క్యాబిన్‌ అనే ఐదు కీలక ఈవీ టెక్నాలజీలను ఈ కారులో వాడారు.

ఈవీ టెక్నాలజీ

సింగిల్‌ చార్జ్‌తో 668 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు ప్రయాణించేలా రెండు రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి.

సింగిల్‌ చార్జ్‌

కేవలం 2.78 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇంత వేగంలోనూ 33.3 మీటర్ల దూరం వెళ్లేలోపే పూర్తిగా ఆగగలదు.

100 కిలోమీటర్ల వేగాన్ని

కారు గరిష్ఠ వేగం గంటకు 265 కిలోమీటర్లు. కారులో మొత్తం 16 యాక్టీవ్‌ సేఫ్టీ ఫీచర్లు.16.1 అంగుళాల 3కే అల్ట్రా-క్లియర్‌ సెంట్రల్‌ కంట్రోల్‌ స్క్రీన్‌. 56 అంగుళాల భారీ హెచ్‌యూడీ.

గరిష్ఠ వేగం గంటకు

అదనపు స్క్రీన్లుగా షియామీ ట్యాబ్లెట్లను కనెక్ట్‌ చేసుకునే సౌకర్యం. ఇలా కారులో మొత్తం 5-స్క్రీన్స్‌ను అనుసంధానం చేసుకోగలము.

యామీ ట్యాబ్లెట్లను