ఎన్నికలకు ముందు కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ ధరను మరోసారి తగ్గించనుందా?

20 January 2024

TV9 Telugu

రానున్న రోజుల్లో పేద కుటుంబాలకు తక్కువ ధరకే ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది.

ఎల్‌పీజీ ధర

గత ఏడాది ఆగస్టులో మోడీ ప్రభుత్వం గృహాలలో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను 200 రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే. 

మోడీ ప్రభుత్వం

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు 400 రూపాయల సబ్సిడీని పొందడం ప్రారంభించారు.

ఉజ్వల

పేద కుటుంబాలకు రూ.300 సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

సబ్సిడీ

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న లబ్ధిదారులు ఢిల్లీలో రూ. 603కి 14.4 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను పొందుతారు. 

ఢిల్లీలో

అదే సమయంలో ప్రస్తుతం దేశంలో సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1200 పలుకుతుండడం సామాన్యులను ఇబ్బందిగా మారింది.

సబ్సిడి లేని గ్యాస్‌

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ఎల్పీజీకి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు

ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య దాదాపు 33 కోట్లు. గతేడాది 2025-26 నాటికి మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్ల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

33 కోట్ల మంది కస్టమర్లు