15 September
Subhash
భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు వివిధ రంగుల కోచ్‌లను చూసి ఉంటారు.
ఎక్కువగా ఎరుపు, బ్లూ కలర్ రంగులో కోచ్‌లు ఉంటాయి. కానీ ప్యాసింజర్ రైళ్లలో ప్ రత్యేకంగా రెడ్ కోచ్‌లను ఏర్పాటు చేయలేదు. దీనికి కారణం ఉంది.
ఎరుపు రంగు కోచ్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB)కోచ్‌లు అంటారు. దీని ఫ్యాక్టరీ పంజాబ్‌లోని కపుర్తలాలో ఉంది.
రెడ్ కోచ్ ప్రత్యేకత ఏంటంటే ఇది అల్యూమినియమ్‌తో తయారు చేస్తారు. దీని వల్ల కోచ్‌లు చాలా నాణ్యతతో ఉంటాయి.
మరో వైపు బ్లూ కలర్ కోచ్‌లు ఇనుముతో తయారు చేస్తారు. అందుకే వాటి బరువు కూడా ఎక్కువగానే ఉంటాయి.
తక్కువ బరువుతో ఉన్న ఎరుపు రంగు కోచ్‌లు చాలా వేగంగా వెళ్తాయి. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 200 వరకు ఉంటుంది.
బ్లూ కలర్ కోచ్‌లతో కూడిన రైళ్లు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఇలా రైళ్లలో రెడ్ కలర్ కోచ్‌లు, బ్లూ కలర్ కోచ్‌ల మధ్య తేడాది. వాటి తయారీని బట్టి స్పీడ్ ఉంటుందని గుర్తించుకోండి.