ఇతర సీఎన్‌జీ కార్ల కంటే టాటా సీఎన్‌జీ కార్లకు ఎందుకంత క్రేజ్‌ ఉంది?

14 February 2024

TV9 Telugu

టాటా CNG కార్లలో iCNG సాంకేతికత అందించబడుతుంది. ఇందులో నేరుగా సిఎన్‌జి మోడ్‌లో కారును స్టార్ట్ చేసుకునే సదుపాయం ఉంది. 

సీఎన్‌జీ

టాటా సీఎన్‌జీ కార్లలు ఇది ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ ఏ ఇతర కంపెనీల సీఎన్‌జీ కార్లలో అందుబాటులో లేదు. 

ఫీచర్‌

ఇతర కారు మొదట పెట్రోల్‌తో ప్రారంభమై సీఎన్‌జీ మోడ్‌కు మారుతుంది. దీంతో పెట్రోల్ వృధా అవుతుంది. కానీ టాటా సీఎన్‌జీ కార్లలో ఇలాంటి సిస్టమ్‌ లేదు.

సీఎన్‌జీ మోడ్‌

టాటా సీఎన్‌జీ కార్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని తన సీఎన్‌జీ కార్లలో అందిస్తోంది.

ట్విన్‌ సిలిండర్‌

ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, బూట్ స్పేస్ అందించడంలో సహాయపడుతుంది. ఒక పెద్ద సీఎన్‌జీ సిలిండర్ స్థానంలో రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లు అందించడం జరిగింది.

బూట్‌ స్పేస్‌

ఇటీవల టాటా మోటార్స్ దాని సీఎన్‌జీ మోడల్స్ టియాగో, టిగోర్‌లలో AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌ను జోడించింది. ఇతర కార్లలో లేని విధంగా ఆప్షన్‌ను జోడించింది.

గేర్‌బాక్స్‌

భారతదేశంలో ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ కారుగా అవతరించింది. హ్యుందాయ్, మారుతి సీఎన్‌జీ కార్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తాయి. 

ఏఎంటీ

అంటే మీకు సీఎన్‌జీతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలంటే టాటా మోటార్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

ఆటోమేటిక్‌