సంపదలోనే కాదు.. అప్పుల్లోనూ ఆయనే అగ్రగామి!

26 November 2023

దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరింటే ముకేశ్‌ అంబానీ అనీ ముక్తకంఠంగా చెబుతారు. మరి దేశంలోనే అత్యంత అధికంగా అప్పులు చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముకేశ్‌ అంబానీ లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. దీనితో దేశంలోనే కాకుండా ప్రపంచ కుభేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడనే విషయం అందరికీ తెలిసిందే

మరి దేశంలోనే అత్యధికంగా అప్పులు ఉన్న వ్యక్తి ఎవరనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు.. ముకేశ్‌ అంబానీనే

అదేంటీ అని అనుకుంటున్నారా? ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం ప్రకారం దేశ అప్పుల్లో కూడా ఆయనే అగ్రగామిగా ఉన్నట్లు వెల్లడైంది

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ.3.13 లక్షల కోట్ల అప్పు చేసింది. ప్రస్తుతం ఎక్కువ అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ప్రథమ స్థానంలో ఉంది

ఆ తర్వాత స్థానంలో దేశంలోనే అతి పెద్ద విద్యుత్ రంగ కంపెనీలలో ఒకటైన 'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)' రూ.2.20 లక్షల కోట్ల అప్పుతో జాబితాలో రెండవ స్థానంలో ఉంది

ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న వోడాఫోన్ ఐడియా అప్పు మాత్రం రూ.2.01 లక్షల కోట్లుగా ఉన్నది. ఆ తర్వాత స్థానంలో రూ.1.65 లక్షల కోట్ల అప్పుతో భారతీ ఎయిర్‌టెల్ నిలిచింది

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.1.40 లక్షల కోట్లు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ రూ.1.29 లక్షల కోట్ల అప్పుతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవడం గమనార్హం