06 November 2023
డిజిటల్ బంగారం కొనాలంటే ఎవరు అర్హులు..?
ప్రపంచంలో భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ప్రతిఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనాలనుకుంటారు.
పెళ్ళిళ్ళు, శుభకార్యాల సమయంలో, దంతేరాస్, దీపావళి, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం అనవాయితీ.
ఇటీవల సాంకేతి విప్లవంతో ప్రతి ఒక్క వినియోగదారుడు డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు.
ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ సురక్షితం కావడంతో బంగారం కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కొని పొదుపు చేస్తున్నారు.
డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలంటే ఏదైనా బ్యాంకులో తప్పనిసరిగా ఖాతా ఉండాల్సిందే..!
డిజిటల్ గోల్డ్ కొనేందుకు మైనర్లు, బ్యాంకుల్లో ఎన్నార్వో ఖాతాల్లేని ప్రవాస భారతీయులు అనర్హులు.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే తదితర మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ పేమెంట్స్‌తో డిజిటల్ బంగారం కొనుగోలు చేయొచ్చు.
ఒకసారి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేశాక.. ఇష్టం లేకుంటే.. వద్దనుకున్నా మళ్లీ మార్కెట్ ధరకు విక్రయించవచ్చు.
ప్రతి రోజూ రూ.49,999 విలువైన డిజిటల్ బంగారం కొనుగోలు చేయవచ్చు. అంతకు మించితే మాత్రం `కేవైసీ` నిబంధనలు వర్తిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి