అత్యధిక కార్పొరేట్ పన్ను ఉన్న దేశం ఏది?

TV9 Telugu

03 February 2025

ప్రపంచవ్యాప్తం అన్ని దేశాలు ప్రజలనుంచి, సంస్థల నుంచి పన్నును వసూళ్లు చేస్తాయి. ఇది అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.

కార్పొరేట్ పన్ను విషయానికి వస్తే.. కొన్ని దేశాలు తక్కువగా, కొన్ని ఎక్కువగా తీసుకుంటాయి. మరి ఎక్కువ వసూళ్లు చేసే దేశాలు ఏంటి.?

అమెరికాలో కార్పొరేట్ పన్ను ప్రస్తుతం 21%.  1909 - 2024 మధ్య అమెరికాలో సగటు కార్పొరేట్ పన్ను రేటు 32.08%.

అమెరికా అత్యధిక కార్పొరేట్ పన్ను 1968లో 52.80% తీసుకోగా.. అత్యల్ప కార్పొరేట్ పన్ను 1910లో 1.00% తీసుకుంది.

భారతదేశంలో ప్రస్తుత కార్పొరేట్ పన్ను రేటు 34.94%, ఇది US కంటే ఎక్కువ. 1997 నుండి 2025 వరకు సగటు కార్పొరేట్ పన్ను 33.92%.

భారతదేశంలో అత్యధిక కార్పొరేట్ పన్ను 2001లో 38.95%. 2019లో 25.17%తో అతి తక్కువ కార్పొరేట్ పన్నును విధించారు.

దేశంలో అధిక కార్పొరేట్ పన్ను కారణంగా భారత్‌లోని కంపెనీలపై అమెరికా కంటే ఎక్కువ పన్ను భారం ఉందని నివేదిక.

రానున్న కాలంలో పన్ను విధానంలో మార్పులు రెండు దేశాల పన్నుల్లో మార్పులకు దారితీయవచ్చు అంటున్నారు నిపుణులు.