29 January 2024
TV9 Telugu
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పించనున్నారు
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్‌గా ఉంటుంది
ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసే అవకాశం ఉంది
ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేయొచ్చు
బడ్జెట్లో ఆటో పరిశ్రమకు ప్రోత్సాహం లభించవచ్చు. ముఖ్యంగా ఈవీ అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది
ఈసారి బడ్జెట్‌లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశముంది
ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో మహిళ
నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఐదుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 ఫిబ్రవరి 1న ఆరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు