14 May 2024
TV9 Telugu
నగదుపై ఆధార పడటం తగ్గడమే కాకుండా డబ్బు సురక్షితంగా మారడంతో పాటు లావాదేవీలు కూడా సులువుగా మారాయి.
ఇవే కాకుండా ఏటీఎం కార్డుతో ప్రజలకు తెలియని మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.
ఏటీఎం కార్డుతో లభించే అతి ముఖ్యమైన సేవ బీమా అని మీకు తెలుసా? ఏటీఎం వల్ల కూడా ప్రతి ఒక్కరికి బీమా సదుపాయం ఉంటుంది.
ప్రజలకు దీనిపై ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల కొంత మందికి మాత్రమే బీమాను క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు.
ఏటీఎం కార్డుదారుడు ప్రమాదానికి గురైతే ఒక చేతి లేదా ఒక కాలు వికలాంగులైతే అతనికి రూ.50 వేల వరకు కవరేజ్ లభిస్తుంది.
ఒక వేళ ఏటీఎందారుడు మరణించినట్లయితే కార్డును బట్టి లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది.
ఏటీఎం కార్డుతో అందించిన బీమాను క్లెయిమ్ చేయడానికి కార్డుదారుని నామినీ సంబంధిత బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంకులో ఎఫ్‌ఐఆర్ కాపీ, ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన సర్టిఫికేట్ వంటి పత్రాలను బీమా క్లెయిమ్ సమయంలో అందించాలి.