పర్సనల్ లోన్ తీర్చలేదా? ఏమి జరగోచ్చు అంటే..

13 September 2023

అత్యవసరం అయి పర్సనల్ లోన్ తీసుకోవడం సహజం. ఒక్కోసారి ఆ లోన్ తిరిగి తీర్చడంలో ఇబ్బందులు తలెత్తి తిరిగి చెల్లించలేకపోతే ఏమి జరుగుతుంది?

ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏదైనా అనుకోని పరిస్థితుల కారణంగా లోన్ తిరిగి చెల్లించడంలో విఫలం అయితే, అది మీ క్రెడిట్‌ స్కోర్‌ హిస్టరీ పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.

అటువంటి పరిస్థితిలో మళ్ళీ మీకు లోన్ దొరకడం కష్టం అవుతుంది. ఇన్ టైం లో లోన్ తిరిగి కట్టకపోతే దానిపై పెనాల్టీలు పడతాయి. దీంతో మనం తీసుకున్న లోన్ మరింత భారంగా తయారవుతుంది.

దీంతో మనం తీసుకున్న  లోన్ మరింత భారంగా తయారవుతుంది. ఇలా అవకుండా ఉండాలంటే  ఈ విషయలో జాగ్రత్త వహించలి.

వడ్డీ రేట్లు పెరుగుతాయి: లోన్ తీర్చాల్సిన సమయంలో తీర్చకపోతే లెండర్స్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. దీనివలన మనం కట్టాల్సిన మొత్తం పెరిగిపోతుంది.

చట్టపరమైన చర్యలు: లోన్ రీపెమేంట్ చేయడంలో కావాలనే లెండర్స్ ని మోసం చేస్తున్నట్టు అనిపించినా.. లోన్ టైం దాటిపోయి చాలాకాలం అయినా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే హక్కు లెండర్స్ కి ఉంటుంది.

తీసుకున్న లోన్ మొత్తంలో ఎంత తాక్కువ మొత్తం  చెల్లించకుండా మిగిలిపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.