బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం పోయిందా?

08 December 2023

తనఖా పెట్టిన ఆభరణాల బాధ్యత బ్యాంకుదే అవుతుంది. ఈ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఖాతాదారులు తనఖా పెట్టిన ఆభరణాలను బ్యాంకు అధికారులు ఫుల్ సెక్యూరిటీ ఉన్న ‘సేఫ్‌’లో జాగ్రత్తగా భద్రపరుస్తారు.

బ్యాంకు శాఖలోని ఎకౌంటెంట్‌తో పాటు క్యాష్‌ ఇన్‌ఛార్జి (క్లర్క్‌) లేదా మరో అధికారి సంయుక్తంగా వీటికి బాధ్యత వహిస్తారు.

బ్యాంకు శాఖల్లో ఆడిట్‌ జరిగినప్పుడు ఆభరణాలు ఏమైనా తగ్గితే.. వెంటనే పరిశీలన జరిపి, లెక్క తేలుస్తారు అధికారలు.

ఏదైనా కారణాలతో బ్యాంకులోని బంగారం కనిపించకపోతే రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకులో నమోదయ్యే బంగారం బరువు మేరకు ఖాతాదార్లు పరిహారం పొందవచ్చు.

ఉదాహరణకు 100 గ్రాముల ఆభరణం తనఖా పెడితే, 98 గ్రాములను పరిగణనలోకి తీసుకుంటారు బ్యాంకులో పని చేసే సిబ్బంది.

దానికి సరిపడా బంగారం గానీ, దాని విలువ మేరకు నగదును కానీ పొందే హక్కు బంగారం తనఖా పెట్టిన ఖాతాదార్లకు ఉంటుంది.

తనఖా పెట్టినప్పటి ధర, చోరీ జరిగినట్లు గుర్తించినప్పటి ధరలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారు అధికారులు.