మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ ఏమి చేస్తారు?

27 September 2023

వీరు స్టాక్ మార్కెట్లు ..ఆర్థిక వ్యవస్థను బాగా అర్థం చేసుకుని, మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను సిద్ధం చేస్తారు. ఆ తరువాత ఏ అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తారు

రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్-రాబడి మధ్య సమతూకాన్ని తీసుకు రావడం ఫండ్ మేనేజర్ చేస్తారు. ఇందువల్ల తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి ఇన్వెస్టర్ పొందుతాడు.

ఫండ్ మేనేజర్ అనే వారు ఫండ్ హౌస్ కి గుండె - మెదడు లాంటి వారని చెప్పవచ్చు. వారు వారి అనుభవం, రీసెర్చ్, ఎనాలసిస్ ఆధారంగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకాన్ని సిద్ధం చేస్తారు.

ఏదైనా స్కీమ్ లో ఏ సమయంలో స్టాక్ కొనాలి లేదా ఎప్పుడు స్టాక్స్ అమ్మేయాలి అనే నిర్ణయం ఫండ్ మేనేజర్ తీసుకుంటారు.

భారతదేశంలో దాదాపు 428 ఫండ్ మేనేజర్‌లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తి రూ. 44. 82 లక్షల కోట్లు.

ఒక ఫండ్ మేనేజర్ ఆమె లేదా అతని వ్యూహాన్ని మార్కెట్ ట్రెండ్, ఆర్థిక స్థితి అలాగే పెట్టుబడిదారుల లక్ష్యం ఆధారంగా నిర్వచిస్తారు. ఫండ్ మేనేజర్ మీ పోర్ట్‌ఫోలియోను ట్రాక్ చేస్తారు.

అందుకు అనుగుణంగా మీకు సూచనలు ఇస్తారు. ఒకవేళ మీరు నష్టాన్ని చూస్తే కనుక సాధ్యమైన ప్రతి పరిస్థితిలో మీరు మెరుగైన రాబడిని పొందేలా వారు రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అమలు చేస్తారు.

అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ మీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్కీమ్‌లో పెట్టుబడులను పెంచడం లేదా తగ్గించడం విషయంలో కాలానుగుణంగా, వేగంగా మార్పులు చేస్తారు.

సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ పనితీరును రూపొందించడంలో ఫండ్ మేనేజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.