అమెరికా ప్రభుత్వం దగ్గర కంటే మన ఇళ్లలోనే మూడు రెట్లు ఎక్కువ బంగారం

14 September 2023

బంగారం అనగానే అందరికీ చాలా ఆసక్తి. మహిళల్లో అయితే ఇది మరీ ఎక్కువ. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో మన దేశం ఉంది.

అందరూ అమితంగా ఇష్టపడే బంగారం గురించి కొన్ని విశేషాలు మీకోసం. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 800 టన్నుల బంగారం వినియోగిస్తున్నారు.

కేవలం ఒక్క టన్ను బంగారం మాత్రమె మన భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగిలినదంతా దిగుమతి చేసుకుంటున్నాం.

స్వాతంత్యం వచ్చేసమయానికి అంటే 76 ఏళ్ల క్రితం 89 రూపాయలు ఉన్న పది గ్రాముల బంగారం ఇప్పుడు 59 వేల రూపాయలకు చేరుకుంది.

అంటే స్వాతంత్యం వచ్చిన తరువాత మన దేశంలో బంగారం ధర ధర 661 రెట్లు పెరిగింది. స్వచ్ఛమైనబంగారం సాధారణంగా ఒంటరిగా లేదా పాదరసం లేదా వెండితో మిశ్రమంగా దొరుకుతుంది.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఇప్పటివరకు 2 లక్షల టన్నుల బంగారం భూగర్భం నుంచి బయటకు తీశారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం... , 2019లో భారతదేశ గృహాలలో 25,000 టన్నులకు పైగా బంగారం ఉంది.

2021 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ బ్యూరో ఆఫ్ ఫిస్కల్ సర్వీస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 8,000 టన్నులకు పైగా బంగారం US ప్రభుత్వం వద్ద డిపాజిట్ అయి ఉంది.