కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? పది లక్షల లోన్ పొందండి ఇలా!

21 September 2023

మీరు బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? మీకు ప్రభుత్వం లోన్ ఇస్తుంది. అది కూడా పది లక్షల రూపాయల వరకూ.

అవును.. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం  కింద లోన్ తీసుకోవచ్చు. దీన్ని ఎలా పొందాలో ఇప్పడు తెలుసుకుందాం.

ఎవరైనా భారత పౌరుడు బిజినెస్ చేయాలనుకుంటే లోన్ పొందే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ లోన్ పొందండి.

ఈ లోన్ కోసం ఎవరో గ్యారెంటర్ అవసరం ఉండదు. అలానే, ఈ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇది ఈజీ తక్కువ సమయంలో వస్తుంది.

అంతేకాదు ఈ లోన్ కోసం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. ఏదైనా ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు, NBFCల నుంచి ముద్ర లోన్ తీసుకోవచ్చు.

ఆయా బ్యాంకుల నిబంధనల ప్రకారం లోన్ ఇస్తారు. దీనిపై 10-12 శాతం వరకూ ఇంట్రస్ట్ రేట్ ఉండవచ్చు. కొన్ని బ్యాంకులోపు తక్కువగా ఉండవచ్చు లేదా ఎక్కువగా ఉండవచ్చు.

మీరు 24 - 70 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారైతే మీకు లోన్ దొరుకుతుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న ఎక్కువ వయసు ఉన్న ఈ లోన్ పొందలేరు.

పూర్తి వివరాల కోసం మీ దగ్గరు ఎదో ఒక బ్యాంక్ లో సంప్రదించవచ్చు. వారి మీకు దీని గురుంచి పూర్తీ వివరాలు తెలుపుతారు. ఆ తర్వాత మీరు లోన్ తీసుకోవచ్చు.