త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వీ30 అండ్ వివో వీ30 ప్రో.. ఫీచర్‌ ఇవి

25 February 2024

TV9 Telugu

వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లను భారత్ మార్కెట్లో త్వరలో ఆవిష్కరించనుంది.

వివో

భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న వివో వీ30 సిరీస్ ఫోన్లు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పికాక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కలర్స్‌

వివో వీ30 ప్రో సిరీస్ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. వివో వీ30 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 

ట్రిపుల్‌ కెమెరా

వివో (Vivo) తన వివో వీ30 (Vivo V30), వివో వీ30 (Vivo V30 Pro) ఫోన్లలో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.

బ్యాటరీ

వివో వీ30 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. 

సెల్ఫీ కెమెరా

ఈ వీవో స్మార్ట్‌ ఫోన్‌ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతోపాటు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 

ఫాస్ట్‌ ఛార్జింగ్‌

గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన వివో ఎస్18 ప్రో ఫోన్ రీ బ్రాండెడ్ వర్షన్‌గా వివో వీ30 ప్రో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

గత ఏడాది

వివో వీ30 అండ్ వివో వీ30 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 + ఎస్వోసీ చిప్‌సెట్ కలిగి ఉంటుంటుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ