02 September 2023

 జీఎస్టీ బిల్లు అప్ లోడ్ చేయండి గిఫ్ట్ కొట్టేయండి! 

వినియోగదారుల్లో జీఎస్టీ బిల్లు తీసుకోవడంపై అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తోంది 

ఈ పథకం పేరు 'మేరా బిల్ మేరా అధికార్'. దీని కోసం కొత్త యాప్ త్వరలో ప్రారంభిస్తారు 

ఐవోఎస్‌, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో  ఈ యాప్ అందుబాటులో ఉంటుంది 

ఏదైనా వస్తువు కొన్నపుడు జీఎస్టీ బిల్లు తీసుకుని దానిని ఈ యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు 

లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ గిఫ్ట్ పట్టేయవచ్చు 

మీరు అప్ లోడ్ చేసే బిల్లు 200 రూపాయల కనీస విలువ ఉండాలి 

అప్ లోడ్ చేసిన బిల్లులను నెలవారీగా.. త్రైమాసికం వారీగా లాటరీ తీస్తారు. 

ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. . లాటరీలో భారీగా నగదు బహుమతులు గెలుచుకోవచ్చు 

మీరు అప్ లోడ్ చేసే బిల్లులో అమ్మకం దారునికి సంబంధించిన జీఎస్టీఐఎన్‌, ఇన్‌వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి

ఒక్కరు ఎక్కువలో ఎక్కువగా  25 ఇన్‌వాయిస్‌లను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.